అమెరికాలో డాక్టర్​ రెడ్డీస్​జెనరిక్​ ఇంజెక్షన్

అమెరికాలో డాక్టర్​ రెడ్డీస్​జెనరిక్​ ఇంజెక్షన్

న్యూఢిల్లీ : పల్మనరీ ఆర్టెరియల్​ హైపర్​టెన్షన్​ట్రీట్​మెంట్​కు ఉపయోగించే జెనరిక్​ ట్రెప్టోస్టినిల్​ ఇంజెక్షన్​ను అమెరికా మార్కెట్లో లాంచ్​ చేశామని డాక్టర్ ​రెడ్డీస్​ ల్యాబొరేటరీస్​ ప్రకటించింది. ఇది 20 ఎంజీ/20 ఎంఎల్​, 50 ఎంజీ/20 ఎంఎల్​, 100 ఎంజీ/20 ఎంఎల్ లేదా 200 ఎంజీ/20 ఎంఎల్ ​సీసాల్లో అందుబాటులో ఉంటుంది. ఇది రెమోడ్యూలిన్​ ఇంజక్షన్​కు సమానం. దీనికి యూఎస్​ ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​ అనుమతి ఉంది.