
హైదరాబాద్, వెలుగు: మోల్నుపిరవిర్‌ను మోల్‌ఫ్లూ బ్రాండ్ కింద డాక్టర్ రెడ్డీస్ మంగళవారం లాంచ్ చేసింది. ఒక క్యాప్సుల్ ధర రూ. 35. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్లను ట్రీట్ చేయడానికి ఈ మెడిసిన్‌ను వాడతారు. ఒక స్ట్రిప్‌లో 10 క్యాప్సుల్స్ ఉంటాయి. ట్రీట్‌మెంట్ కోర్సులో 40 క్యాప్సుల్స్‌ను 5 రోజుల పాటు వేసుకోవాలని డాక్టర్ రెడ్డీస్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. మొత్తం ఖర్చు రూ. 1,400 అని తెలిపింది. ప్రస్తుతం పేషెంట్లకు అందుబాటులో ఉన్న అఫోర్డబుల్ ట్రీట్‌మెంట్ విధానం ఇదేనని అభిప్రాయపడింది. దేశంలోని వివిధ పార్మసీలలో వచ్చే వారం నుంచి ఈ మెడిసిన్ అందుబాటులో ఉంటుంది.