రైతులను పట్టించుకోని ప్రభుత్వం : విశారదన్‌‌‌‌ మహారాజ్‌‌‌‌

రైతులను పట్టించుకోని ప్రభుత్వం : విశారదన్‌‌‌‌ మహారాజ్‌‌‌‌

బోథ్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌‌‌‌ డాక్టర్ విశారదన్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ విమర్శించారు. లక్ష కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా శుక్రవారం బోథ్‌‌‌‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ సివిల్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌ను, మార్కెట్‌‌‌‌ యార్డ్‌‌‌‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌‌‌‌ యార్డ్‌‌‌‌ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 

రెడ్డి, వెలమ ప్రభుత్వాలతో  బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరగడం లేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రభుత్వం వస్తేనే రైతులు, హమాలీలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నెల లక్ష్మణ్, నాయకులు వెంకటేశ్‌‌‌‌, ప్రవీణ్, రాకేశ్, గంగయ్య, జ్ఞానేశ్వర్‌‌‌‌, నరేశ్, భూమన్న పాల్గొన్నారు.