- వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ కంప్లీట్
- ఉమ్మడి జిల్లాలో 18 మున్సిపాలిటీలు, 407 వార్డుల లిస్ట్ రిలీజ్
యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన ఓటర్ లిస్ట్‌ను టీఈ పోల్ పోర్టల్‌లో అందుబాటులోకి తేవడంతో వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ముగిసింది. ముసాయిదా ఓటర్ లిస్ట్ గురువారం రిలీజ్ అయింది. అయితే ముసాయిదా ఓటర్ జాబితాలో మూడు జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
19 మున్సిపాలిటీలు
ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 427 వార్డులు ఉన్నాయి. అయితే నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. దీంతో 18 మున్సిపాలిటీలు, 407 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన ఓటరు లిస్ట్‌ను టీఈ పోల్ పోర్టల్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచింది.
ఈ పోర్టల్ నుంచి ఓటరు లిస్ట్‌ను మున్సిపల్ కమిషనర్లు తీసుకొని వార్డుల వారీగా మ్యాపింగ్ చేశారు. మార్పులు, చేర్పుల అనంతరం గురువారం ముసాయిదా ఓటరు జాబితా రిలీజ్ చేశారు. జనవరి 6న జిల్లా స్థాయిలో ఎన్నికల అథారిటీ మీటింగ్ నిర్వహిస్తారు. జనవరి 10 తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం 18 మున్సిపాలిటీల్లో 8,38,194 మంది జనాభా ఉంది. 2011 జనాభా లెక్కలప్రకారం ఎస్సీలు 1,14,104 ఉండగా, ఎస్టీలు 44,040 ఉన్నారు. మిగిలిన వారిలో మెజార్టీగా బీసీలు ఉన్నారు.
మహిళా ఓటర్లే ఎక్కువ
ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 18 మున్సిపాలిటీల్లోని 407 వార్డుల్లో మొత్తం ఓటర్లు 6,64,901 ఉన్నారు. ఇందులో మహిళలు 3,43,368, పురుషులు 3,22,137 ఉండగా ఇతరులు 96 మంది ఉన్నారు. అయితే గెలుపు ఓటముల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు.
సూర్యాపేటలో..
మున్సిపాలిటీలు మహిళలు పురుషులు ఇతరులు మొత్తం
సూర్యాపేట 52,205 56,679 13 108897
కోదాడ 30,520 28,069 12 58601
హుజూర్నగర్ 15731 14257 08 29996
తిరుమలగిరి 7817 7638 0 15,455
నేరేడుచర్ల 7116 6629 01 13,476
మొత్తం 1,17,863 1,08,798 34 2,26,695
