దేశవ్యాప్తంగా ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ

దేశవ్యాప్తంగా ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ

ఎన్నికల్లో రాష్ట్రపతిగా విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీ ముద్దుబిడ్డ కొత్త చరిత్ర సృష్టించారంటూ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, రాష్ర్ట మంత్రులు అభినందనలు తెలియజేశారు. రాష్ర్టపతి ఎన్నికల్లో ముర్ముపై పోటీ చేసిన విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా అభినందనలు తెలియజేశారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకూ కూడా ద్రౌపది ముర్ముకు కనీసం శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదు. 

సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం11: 57 నిమిషాలకు ట్వీట్ చేశారు. ‘భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ముకు అభినందనలు. మీరు రాష్ట్రపతి అయ్యాక తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  మహిళా రిజర్వేషన్ బిల్లు, తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుదల బిల్లులు ఆమోదం పొందుతాయి’ అని ఆశిస్తున్నామంటూ ట్వీట్ చేశారు. 

రాష్ట్రపతి ఎలక్షన్స్ ముందు యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వచ్చినప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రులు, పార్టీ నాయకులు వెళ్లి ఘన స్వాగతం పలికారు. సిన్హా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో యశ్వంత్ రాకతో టీఆర్ఎస్ శ్రేణులు హడావుడి చేశాయి. సీఎం కేసీఆర్ కేంద్రంతో పాటు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.