12న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలతో ముర్ము భేటీ

12న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలతో ముర్ము భేటీ

ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈనెల 12న (మంగళవారం) తెలంగాణకు రానున్నారు.  ఈసందర్భంగా ఆమె బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్,  రాజాసింగ్, రఘునందన్ రావులను కలువనున్నారు. ఒడిశాలోని సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్​డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌‌‌‌‌‌‌‌గానూ పనిచేశారు. రాజకీయాల్లో కింది స్థాయి పదవి అయిన కౌన్సిలర్ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి పోటీపడే స్థాయికి ముర్ము అంచెలంచెలుగా ఎదిగారు. అన్నీ అనుకూలిస్తే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యే తొలి గిరిజన మహిళగా ద్రౌపది చరిత్ర సృష్టిస్తారు.