ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిని చేయడం బీజేపీకే సాధ్యమైంది

ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిని చేయడం బీజేపీకే సాధ్యమైంది

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికవడం దేశ ప్రజల విజయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ఆదివాసి మహిళను ఓడగొట్టేందుకు ప్రయత్నించాయని ఆరోపించారు. ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిని చేయడం బీజేపితోనే సాధ్యమైందన్నారు.ఈ ఎన్నికలో తనకు ఓటేసే అవకాశం రావడం సంతోషకరమన్నారు.కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తానని మాట తప్పారని..రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తోందని ఆరోపించారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు.వేములవాడ ఎమ్మెల్యే ఏ దేశంలో ఉన్నాడో తెలియదని.. ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేపై సీఎం కేసీఆర్ కు ఎందుకు అంత ప్రేమ అని ప్రశ్నించారు. రాజన్న గుడికి ఏటా 100 కోట్లు ఇస్తానన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దేవుడ్ని కూడ మోసం చేస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని విమర్శించారు.