డీఆర్డీఓలో ఉద్యోగాలు: డిగ్రీ ఉంటే చాలు, కొద్దిరోజులే అవకాశం

డీఆర్డీఓలో ఉద్యోగాలు: డిగ్రీ ఉంటే చాలు, కొద్దిరోజులే అవకాశం

హైదరాబాద్​లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ ఆర్గనైజేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 26.

పోస్టులు: ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్ 01, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్ 01, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ 01. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఏ, బీఎస్సీ, బీసీఏలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: అడ్మిన్ అసిస్టెంట్ పోస్టుకు 35 ఏండ్లు, సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్ పోస్టుకు 45 ఏండ్లు, ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్ 50 ఏండ్లు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.