పృథ్వీ-2 పరీక్ష విజయవంతం

 పృథ్వీ-2 పరీక్ష విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. పృథ్వీ-2 క్షిపణి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ శాఖ వెల్లడించింది. పృథ్వీ సిరీస్‌లో రూపొందించిన ఈ బాలిస్టిక్‌ మిస్సైల్‌తో భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరిందని పేర్కొంది.

 పృథ్వీ-2 క్షిపణి యొక్క స్ట్రైక్ రేంజ్ దాదాపు 350 కిలో మీటర్లు.  పృథ్వీ-2 క్షిపణిని  భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ  అభివృద్ధి చేసింది. ఉపరితలం నుండి ఉపరితలం పై ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి.. భారతదేశ పృథ్వీ క్షిపణి సిరీస్‌లో భాగం. ఇందులో పృథ్వీ-1, పృథ్వీ-2, పృథ్వీ-3 , ధనుష్ ఉన్నాయి. పృథ్వీ-2 క్షిపణి 500 కిలోల వరకు పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.  పృథ్వీ 2 స్వదేశీంగా అభివృద్ధి చేసిన క్షిపణి. ఇది స్ట్రాప్ డౌన్ సీరియల్ నావిగేషన్ సిస్టమ్‌పై నడుస్తుంది.