పీటీసీలో డ్రిల్‌‌ నర్సరీ ప్రారంభం

పీటీసీలో డ్రిల్‌‌ నర్సరీ ప్రారంభం

ఖిలా వరంగల్‌‌, వెలుగు : మామూనూర్‌‌ పోలీస్‌‌ ట్రైనింగ్‌‌ సెంటర్‌‌లో కొత్తగా నిర్మించిన డ్రిల్‌‌ నర్సరీని వరంగల్‌‌ పోలీస్‌‌ కమిషనర్‌‌ అంబర్‌‌ కిశోర్‌‌ ఝా శనివారం ప్రారంభించారు. అనంతరం డ్రిల్‌‌ ట్రైనింగ్‌‌ తీరును ఆఫీసర్లు ప్రదర్శించారు. కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్‌‌ పూజా ఇంజారపు, క్రైం డీసీపీ దాసరి మురళీధర్, ఏసీపీలు, డీఎస్పీలు పాల్గొన్నారు.