పనులు లేట్.. ప్రజలకు పాట్లు

పనులు లేట్.. ప్రజలకు పాట్లు

ఎల్బీనగర్​లోని మెట్రో పిల్లర్​నంబర్1660 వద్ద చేస్తున్న డ్రైనేజీ లైన్ పనులు నెమ్మదిగా సాగుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిపేర్లలో భాగంగా పిల్లర్లకు ఇరువైపులా మెయిన్​రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు తవ్వారు. చీకటి పడ్డాక వాహనదారులు ఇవి కనిపించడం లేదు. డ్రైనేజీ లైన్​పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనికితోడు ఎటూ వెళ్లే దారి లేకపోవడంతో పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై మూడు రోజుల కింద కురిసిన వర్షపు నీరు భారీగా నిలిచింది. స్థానికులకు, వాహనదారులకు అటుగా వెళ్లడం కష్టంగా మారింది.