గ్రేటర్ వాసులు అలర్ట్... హైదరాబాద్ కి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పంపింగ్ మెయిన్ లీకేజీ ఏర్పడింది. ఈ క్రమంలో వాటర్ బోర్టు లీకేజీకి మరమ్మతులు చేస్తుంది. దీంతో అక్టోబర్ 24 ఉదయం 6 గంటల నుంచి 25 ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఇవే..
శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్ పేట్, ఆళ్లబండ, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, లాలాపేట్, సాహేబ్ నగర్, ఆటో నగర్, సరూర్ నగర్, వాసవి రిజర్వాయర్లు, సైనిక్ పురి, మౌలాలి, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావురి హిల్స్, స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్ర నగర్, మధుబన్, దుర్గా నగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్ పూర్, గంధం గూడ, బోడుప్పల్, మల్లికార్జున నగర్, మాణిక్ చంద్, చెంగిచెర్ల, భరత్ నగర్, పీర్జాదిగూడ, పెద్ద అంబర్ పేట్