ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ఏది అంటే ఏమాత్రం ఆలోచించకుండా చెప్పే పేరు ‘దృశ్యం’. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'దృశ్యం 3' (Drishyam 3). ఈ మూవీ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మే 21, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ షేక్!
జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈసారి ఎలాంటి ప్లాన్ వేశాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పీక్స్‌కు చేరింది. థియేటర్లలోకి రావడానికి ఇంకా మరో 10 రోజులు ఉన్నప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'దృశ్యం 3' వరల్డ్ వైడ్ అడ్వాన్స్ సేల్స్ అప్పుడే రూ. 5.20 కోట్లు దాటాయి. కేవలం ఓవర్సీస్‌లోనే సుమారు 320K డాలర్ల మార్కును టచ్ చేసి ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ రేంజ్ ఓపెనింగ్స్ చూస్తుంటే మలయాళ చిత్ర పరిశ్రమలో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఖాయమని అంచనా వేస్తున్నారు.
#Drishyam3 Worldwide Advance Reached ₹5.20Cr, Overseas - $320K
— AB George (@AbGeorge_) May 11, 2026
10 Days To Go…@Mohanlal @jeethu4ever @antonypbvr pic.twitter.com/UL9QvtWNHT
బాలీవుడ్‌లో వేరే లెవెల్ ప్లాన్..!
మరోవైపు, ఈ చిత్ర హిందీ రీమేక్ కూడా శరవేగంగా సిద్ధమవుతోంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న హిందీ 'దృశ్యం 3' షూటింగ్ దాదాపు పూర్తయిందని, కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని నిర్మాత అభిషేక్ పాఠక్ క్లారిటీ ఇచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
►ALSO READ | యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే బ్లాస్ట్.. ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' గర్జనతో పాటు త్రివిక్రమ్ సర్ప్రైజ్!
అయితే ఇక్కడే ఒక క్రేజీ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. మలయాళ 'దృశ్యం 3' పూర్తిగా ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్స్ చుట్టూ తిరిగితే.. హిందీ వెర్షన్‌ను మాత్రం బాలీవుడ్ ఆడియన్స్‌కు నచ్చేలా కంప్లీట్ హై-వోల్టేజ్ ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మార్చేసినట్లు అభిషేక్ పాఠక్ వెల్లడించారు. రెండు వెర్షన్ల కథాంశాలు వేరువేరుగా సాగనున్నాయని, ట్రైలర్ వచ్చాక ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని హింట్ ఇచ్చారు.
మోహన్‌లాల్ X అజయ్ దేవగన్..?
మలయాళ జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్), హిందీ విజయ్ సాలగాంకర్ (అజయ్ దేవగన్) ఇద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూసే ఛాన్స్ ఉందా? అనే ప్రశ్నకు అభిషేక్ పాఠక్ పాజిటివ్‌గా స్పందించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అది ఒక హిస్టరీ అవుతుంది అని పేర్కొన్నారు. మోహన్‌లాల్ ఇటీవల 'పేట్రియాట్' సినిమాతో అలరించగా, ఇప్పుడు 'దృశ్యం 3'తో వరల్డ్ వైడ్ థియేటర్లను రూల్ చేయడానికి రెడీ అవుతున్నారు..
