త్వరలో వాహన చట్టంలో మార్పులు

త్వరలో వాహన చట్టంలో మార్పులు

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం చట్టరీత్యా నేరం. అయితే అది ఇక నుంచి  నేరం కాదని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అయితే.. దానికంటూ కొన్ని షరతులు వర్తిస్తాయని పార్లమెంట్ లో ఆయన ప్రకటన చేశారు. ఫోన్ ను నేరుగా పట్టుకొని మాట్లాడడం మాత్రం నేరమన్నారు. ఫోన్ ను చేతిలో పట్టుకోకుండా బ్లూటూత్ డివైస్తో మాట్లాడితే నేరం కాదన్నారు. అయితే, ఆ సమయంలో ఫోన్ ను కారులో పెట్టరాదని.. జేబులోనే పెట్టుకుని మాట్లాడాలని చెప్పారు.

ఒకవేళ బ్లూటూత్ లో ఫోన్ మాట్లాడేటప్పుడు ట్రాఫిక్ పోలీసులు చలానాలు వేస్తే కోర్టులో సవాల్ చేయవచ్చని స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిపారు మంత్రి నితిన్ గడ్కరీ. 

మరిన్ని వార్తల కోసం...

కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్