
- పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ రద్దు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై గురువారం డ్రోన్ దాడి జరిగింది. గురువారం రాత్రి 8 గంటలకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో భాగంగా పెషావర్ జాల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే డ్రోన్‌దాడి కారణంగా మ్యాచ్‌ను రద్దు చేశారు. డ్రోన్‌దాడిలో స్టేడియం కొంతమేర దెబ్బతిన్నది. ఈ దాడి జరగడానికి కొన్ని గంటల ముందు ఇండియాపై పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. దీనికి ప్రతిగా లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్ ధ్వంసం చేసింది.