ఎక్స్‌ప్లోజివ్స్‌తో భారత భూభాగంలోకి దూసుకొచ్చిన డ్రోన్

ఎక్స్‌ప్లోజివ్స్‌తో భారత భూభాగంలోకి దూసుకొచ్చిన డ్రోన్

జ‌మ్మూక‌శ్మీర్‌లో డ్రోన్లు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా క‌నాచ‌క్‌లో  శుక్ర‌వారం ఓ డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. దాన్ని హెక్సా‌కాప్టర్‌గా అధికారులు గుర్తించారు. ఆ డ్రోన్ నుంచి 5 కిలోల‌ పేలుడు ప‌దార్ధాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారత భూభాగానికి 6 కిలోమీటర్ల లోపల ఈ డ్రోన్‌ను గుర్తించినట్లు బలగాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం స‌త్వారా ప్రాంతంలో ఓ అనుమానాస్పద డ్రోన్ సంచ‌రించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఆ డ్రోన్ జ‌మ్మూ ఎయిర్‌బేస్ వ‌ద్ద తిరుగుతున్నట్లు ఎన్ఎస్‌జీ ద‌ళాల యొక్క యాంటీ డ్రోన్ సిస్ట‌మ్ గుర్తించింది. గత కొంత కాలం నుంచి జ‌మ్మూ ఎయిర్‌బేస్ వ‌ద్ద డ్రోన్ల కలకలం రేగడంతో.. ఆ ప్రాంతమంతా యాంటీ డ్రోన్ సిస్ట‌మ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.