
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ హైదరాబాద్ నగరంలో భద్రత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే నిఘా సంస్థల హెచ్చరికలతో BHEL వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల చుట్టూ భద్రత పెంచారు. అదే విధంగా వివిధ కీలక ప్రాంతాలలో భద్రతను మరింత పెంచారు. వీటికి తోడు నగరంలో కొన్ని ప్రాంతాల్లో డ్రోన్స్ ఎగరవేయడంపై తాత్కాలికంగా నిషేధించారు.
భద్రతా కారణాల దృష్ట్యా శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో డ్రోన్స్ ఎగరవేయడాన్ని నిషేధించారు. 10-05-25 నుండి 09-06- 25 వరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చుట్టూ పది కిలోమీటర్ల వరకు ఈ నిషేధం వర్తిస్తుందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్, రిమోట్ తో ఆపరేట్ చేసే ఎలక్ట్రిక్ పరికరాలు నిషేధిస్తున్నట్లు ఆయన చెప్పారు.
►ALSO READ | ఉగ్రవాదులు ఒక్కడిని టచ్ చేసినా..ప్రతిసారీ యుద్ధమే చేస్తాం:పాకిస్తాన్కు మోదీ వార్నింగ్
పాకిస్తాన్ అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించి కయ్యానికి కాలు దువ్వుతున్న తరుణంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. అయితే శంషాబాద్ విమానాశ్రయం మూయకపోయినప్పటికీ.. భద్రతా పరమైన చర్యలు చేపట్టారు పోలీసులు. అందులో భాగంగా నెల రోజులపాటు ఎయిర్పోర్ట్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ఎలక్ట్రిక్ పరికరాలు అనుమతి లేదని కమిషన్ తెలిపారు.