ఐదు రోజుల పోలీస్​ కస్టడీకి డ్రగ్స్ స్మగ్లర్ టోనీ

ఐదు రోజుల పోలీస్​ కస్టడీకి డ్రగ్స్ స్మగ్లర్ టోనీ
  • ఐదురోజులకు అనుమతిచ్చిన నాంపల్లి కోర్టు
  • సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో విచారణకు స్పెషల్ టీమ్‌‌
  • డ్రగ్స్​ కేసులో నలుగురు వ్యాపారుల కోసం సెర్చింగ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టోనీని నాంపల్లి కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. శనివారం నుంచి 5 రోజుల పాటు విచారించేందుకు అనుమతిస్తూ గురువారం ఆదేశాలిచ్చింది. దీంతో రిమాండ్​పై చంచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ జైలులో ఉన్న టోనీని పంజాగుట్ట పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకోనున్నారు. సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోనీని విచారించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే ఫారెన్ లాంగ్వేజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిసిన వారి సాయం తీసుకోనున్నారు. ఆఫ్రికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వస్తున్న డ్రగ్స్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయనే దాన్ని  ట్రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.  

నలుగురు వ్యాపారుల కోసం సెర్చింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కొకైన్ స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో నైజీరియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చుక్వు డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోనీ సహా ఏడుగురు వ్యాపారస్తులు, ఇద్దరు ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గతవారం నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టోనీ సహా ఏడుగురిని కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరగా, టోనీని మాత్రమే కస్టడీకి ఇచ్చింది. ఈ కేసులో పరారీలో ఉన్న వ్యాపారులు అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గార్ధపల్లి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గజేంద్ర ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సోమ శశికాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం పోలీసులు సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. టోనీ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నూర్ మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కస్టమర్ల డేటాను కలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేలా కస్టడీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. టోనీ మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా, వాట్సాప్ కాల్స్, చాటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేస్​ చేయనున్నారు. కాగా రిపీటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డ్రగ్స్ ఆర్డర్స్ చేసిన కస్టమర్లను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. 

ఇవి కూడా చదవండి

మామిడిలో కొత్త టెక్నాలజీ