ఫార్మా కంపెనీలో అక్రమ డ్రగ్స్ దందా.. సీజ్ చేసిన అధికారులు

ఫార్మా కంపెనీలో అక్రమ డ్రగ్స్ దందా.. సీజ్ చేసిన అధికారులు

హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో అక్రమ డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు. ఒవాయిడ్ ఫార్మాకెమ్ అనే కంపెనీలో సోదాలు నిర్వహించిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన 23.93లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ ని సీజ్ చేశారు. దీంతో పాటు 800 కేజీల యాక్టివేటెడ్ చార్కోల్, 250 సిమెథికోన్ ట్యాబులెట్లను సీజ్ చేశారు అధికారులు. జీడిమెట్లలో ఉన్న ఈ ఫార్మా కంపెనీ దొంగ లైసెన్సులు సృష్టించి డ్రగ్స్ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.

అంతే కాకుండా సదరు కంపెనీ బ్యాన్ చేసిన డ్రగ్స్ ని కూడా విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు అధికారులు. ఈ క్రమంలో 420, 468 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేస్తున్నామని తెలిపారు. అక్రమ డ్రగ్స్ దందాను సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.