జైలు నుంచే డ్రగ్స్ దందా.. పంజాగుట్ట డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు..

జైలు నుంచే డ్రగ్స్ దందా.. పంజాగుట్ట డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు..

పంజాగుట్ట డ్రగ్స్ కేసులో ఒక్కోటిగా సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో తీగ లాగే కొద్దీ డొంక కదులుతుంది. నార్కోటిక్ విచారణలో డ్రగ్స్ నిందితుడు స్టాన్ లీ కీలక విషయాలు చెప్పాడు. గోవా కోల్వలే జైలు నుంచే ఓక్రా ముఠా స్టాన్ లీ కి డ్రగ్స్ సరఫరా చేసినట్టు టిఎస్ న్యాబ్ అధికారులు గుర్తించారు. కోర్టు అనుమతితో గోవాకి వెళ్ళిన నార్కోటిక్స్ బృందం జైలులో ఉన్న ఓక్రాతో పాటు ఫైజల్ ను విచారించింది. 

ఓక్రా ,ఫైజల్ గోవా జైలులో ఉండి సెల్ ఫోన్స్ ద్వారా యూరప్ దేశాల నుంచి వివిధ రకాల డ్రగ్స్ ను ముంబైకి తెచ్చి దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్నట్టు నార్కోటిక్స్ బ్యూరో గుర్తించింది. ఓక్రా, ఫైజల్ ఇద్దరు జైల్లో సెల్ ఫోన్ వాడుతున్నట్టు నార్కోటిక్ అధికారులు  గోవా పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోవా కొల్వాలే జైల్లో తనిఖీలు చేసిన పోలీసులు 16 సెల్ ఫోన్లను గుర్తించారు. ఓక్రా ,ఫైజల్ ను హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తే మరింత సమాచారం వస్తుందని నార్కోటిక్స్ బ్యూరో భావిస్తుంది.