తెలంగాణ యాంటి నార్కోటిక్ పోలీసుల ఆపరేషన్ భారీ ఆపరేషన్ చేపట్టారు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ను ఆర్డర్ చేస్తున్న కన్జ్యూమర్లు పట్టుకున్నారు. నార్కోటిక్ టెక్నికల్ వింగ్ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ కు బానిసగా మారిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జూలై 31న డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ కోసం క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నగదు చెల్లింపులు చేసినట్టు గుర్తించారు. అస్సాం నుండి స్పీడ్ పోస్టులో డ్రగ్స్ డెలివరీ అయినట్టు నిర్ధారించారు. న్యూస్ పేపర్ లో డ్రగ్స్ చుట్టి ప్లాస్టర్ అంటించి సరఫరా చేశారని తెలిపారు. ఆగస్ట్ 8న డ్రగ్స్ డెలివరీ తీసుకుంటుండగా ఖమ్మం పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
