డ్రగ్స్ సరఫరా గ్యాంగ్ అరెస్ట్ .. కొకైన్‌ స్వాధీనం.. నార్శింగ్ పోలీసుల అదుపులో నిందితులు

డ్రగ్స్ సరఫరా గ్యాంగ్ అరెస్ట్ ..  కొకైన్‌ స్వాధీనం.. నార్శింగ్ పోలీసుల అదుపులో నిందితులు

గండిపేట, వెలుగు: డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠాను నార్సింగి పోలీసులు పట్టుకుని రూ.7.50 లక్షల విలువైన కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ లో డీసీపీ యోగేశ్​ గౌతమ్‌ వివరాలను వెల్లడించారు. మంచిరేవుల సమీపంలో అనంత్‌కుమార్‌(50), వీరబాబు(32), కార్తీకేయ శేఖర్‌ కొకైన్‌ కలిగి ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. నార్సింగి పోలీసులు, టీజీఏఎన్‌బీ ఈగల్‌ అధికారులు మంచిరేవుల సమీపంలో అనంత్​కుమార్​, వీరబాబును పట్టుకుని 107.4 గ్రాముల కొకైన్​ స్వాధీనం చేసుకున్నారు. కార్తీకేయ శేఖర్​ పరారీలో ఉన్నట్లు తెలిపారు.