పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చెప్పినదంతా అబద్దమే..తేల్చిన ఫ్యాక్ట్ చెక్

పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చెప్పినదంతా అబద్దమే..తేల్చిన ఫ్యాక్ట్ చెక్
  • అబద్ధమేనని తేల్చిన ఫ్యాక్ట్ చెక్​

ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 90% స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దాడి చేశామని పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ అన్నారు. భారత్ యుద్ధ విమానాలు రాఫెల్, సు-30, మిగ్-29, మిరాజ్ 2000లతో పాటు ఎస్-400 వ్యవస్థలను విజయవంతంగా కూల్చివేసినట్లు నిరాధారమైన కామెంట్స్ చేశారు.

మంగళవారం లిబియాలో మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలపై నిపుణులు ఫ్యాక్ట్ చెక్ జరపగా.. అవన్నీ అబద్ధమేనని తేలింది. పాకిస్తాన్ ఉపయోగించిన మిస్సైల్స్, డ్రోన్స్, రాడార్లు, అవియానిక్స్ చైనాకు చెందినవేనని అంతర్జాతీయ నిపుణులు స్పష్టం చేశారు.