గుజరాత్ లో రూ.3.5కోట్ల డ్రగ్స్ పట్టివేత...

గుజరాత్ లో రూ.3.5కోట్ల డ్రగ్స్ పట్టివేత...

అహ్మదాబాద్ పోలీసులు చేపట్టిన యాంటీ డ్రగ్ ఆపరేషన్ లో భాగంగా చేసిన సోదాల్లో మూడున్నర కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.2023 - 24కు సంబంధించి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న 3,500 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల్లో డ్రగ్స్, బంగారం వాటా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 25 ఏళ్ల నైజీరియన్ మహిళ నుండి సుమారు రూ. 5.6 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న థానే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 

ఈ ఘటన జరిగిన ఒకరోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. గురువారం నాడు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమె నుండి 56.3 గ్రాముల ఎండీ క్రిస్టల్ స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ 5.6లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.