జైలుకెళ్లండి.. కోర్టులో నిలబడండి

జైలుకెళ్లండి.. కోర్టులో నిలబడండి

హైదరాబాద్ వెలుగు: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ  480 మందికి గురువారం కోర్టులు శిక్షలు విధించాయి. కొంతమందికి జైలు శిక్ష విధించగా..మరికొందరిని కోర్టులోనే నిలబమని తీర్పు చెప్పాయి.1 నుంచి 10రోజుల పాటు 223 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. మరో 257 మందిని కోర్టు సమయం ముగిసే వరకు నిల్చోబెట్టింది. 60 డ్రైవింగ్ లైసెన్సులను నెల రోజుల నుంచి ఆరేళ్ళ పాటు సస్పెండ్ చేసింది. మరో 2 లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

దీంతో పాటు డ్రంకెన్ డ్రైవర్లకు రూ.61లక్షల 35 వేల 400 జరిమానాలు విధించాయి.  చెకింగ్స్ లో పట్టుబడ్డ వారిపై బీఏసీ లెవల్స్ బట్టి ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. హైదరాబాద్ 3వ,4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీట్లు ఫైల్ చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జులై నెల ప్రారంభం నుంచి  31 వరకు 2,815  మంది డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డారు.