హైదరాబాద్ వనస్థలిపురంలో కారు బీభత్సం.. మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు..

హైదరాబాద్ వనస్థలిపురంలో కారు బీభత్సం.. మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు..

హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ ను అరికట్టేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ కట్టడి చేస్తున్నా కూడా డ్రంక్ డ్రైవ్ కేసులు ఆగడం లేదు. ముఖ్యంగా సిటీలో యువకులు తాగి రోడ్లపైకి వచ్చి హల్చల్ చేస్తున్న సీన్స్ ఎక్కువైపోతున్నాయి. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు బీభత్సం సృష్టించారు. ఆదివారం ( అక్టోబర్ 12 ) జరిగిన ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

వనస్థలిపురం సమీపంలోని గుర్రంగూడలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు రెచ్చిపోయారు. థార్ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులు బైక్ ను ఢికొట్టారు. అనంతరం డివైడర్ ను ఢీకొట్టి కారు బోల్తా పడింది.

ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్థానికులకు సమాచారం అందించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.