పోలీసులకు రోజూ2 సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

పోలీసులకు రోజూ2 సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

పోలీసులకు ప్రమాదాల బారినుండి తప్పించాలనే ఉద్దేశంతో మరిన్ని చర్యలు తీసుకుందుంది రాచకొండ కమిషనరేట్. ఇక నుంచి ఉదయం డ్యూటి ఎక్కిన తర్వాత రాత్రి డ్యూటి అయిపోయినా కూడా పైపులు పెట్టి ఏమైనా మందు తాగారా అని చెక్ చేస్తున్నారు. కొంత కాలంగా డ్యూటీలో ఉన్న పోలీసులు మధ్యం మత్తు ప్రమాదాలు గురవుతుండడంతో వాటిని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్.

కొన్ని రోజుల క్రితం డ్యూటీలో ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీసులు రోడ్డు ప్రమాదాలకు గురై గాయాపాలవుతున్నారని ఈ నిర్ణయానికి వచ్చారు. రాచకండ కమిషనరేట్ పరిధిలోని ఠాణాలలో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు డ్యూటికి వచ్చే పెట్రోలింగ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ డ్రైవర్లలతోపాటు డ్యూటిలో ఉండే ఇన్చార్జులకు చేస్తున్నారు. అలాగే రాత్రి డ్యూటి అయిపోగానే ఇంటికి వెళ్లేటప్పుడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఇంటికి పంపుతున్నారు ట్రాఫిక్ పోలీసులు.