సికింద్రాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ యువతి హల్ చల్ : ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించింది

సికింద్రాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ యువతి హల్ చల్ : ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించింది

హైదరాబాద్ లో ఓ యువతి పట్టపగలు.. నడిరోడ్డుపై ట్రాఫిక్ పోలీసులతో ఓవరాక్షన్ చేసింది. మందు కొట్టి వేగంగా కారు నడుపుతున్న ఈ యువతిని.. పోలీసులు అడ్డుకోవటమే దీనికి కారణం. 2023, అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం.. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ దగ్గర ఈ ఘటన జరిగింది. షహనాజ్ అనే ఈ యువతి.. ఈవెంట్ ఆర్గనైజర్ గా పని చేస్తున్నారు. ఈ యువతితోపాటు ఈవెంట్ సిబ్బంది కూడా ఆమెతో ఉన్నారు. పార్టీలో మందు తాగటమే కాకుండా.. కారును వేగంగా డ్రైవ్ చేస్తూ వస్తుండగా.. రెండు కిలోమీటర్లు ఛేజ్ చేసిన మరీ అడ్డుకున్నారు పోలీసులు. కారును ఆపటంపై  రోడ్డుపై పోలీసులతో వాగ్వాదానికి దిగింది ఆ యువతి. 

ఛేజింగ్ సమయంలో.. ఓ ట్రాఫిక్ పోలీసును సైతం ఢీకొట్టింది ఆ యువతి. చివరికి తాడ్ బండ్ సమీపంలో కారును పట్టుకున్నారు పోలీసులు.  యువతి హంగామాతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులనే తిడుతూ.. వాళ్లపై దాడికి ప్రయత్నించింది. చుట్టుపక్కల వారు అడ్డుకుంటున్నా.. మద్యం మత్తులో ఏ మాత్రం లెక్కచేయకుండా.. బూతులు తిడుతూ విరుచుకుపడింది. దీంతో చేసేది లేక.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. వారు వచ్చి ఆ యువతితోపాటు స్నేహితులను పోలీస్టేషన్ కు తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. 427 పాయింట్లు వచ్చాయి. 

ఆ యువతిపై డ్రంక్ అండ్ డ్రైవ్, న్యూసెన్స్ కేసు, పోలీసులతో అసభ్య ప్రవర్తన, విధులకు ఆటంకం కలిగించటం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 

ALSO READ : నో మనీ.. ఫుల్ హ్యాపీ.. లైఫ్ ఎంజాయి.. ఇది సాధ్యమేనా.. .