Viral Video: ఇంత కిరాతకం ఏంట్రా: భార్యను..కుక్కలా కట్టేసి..బండితో ఈడ్చుకెళ్లిన భర్త

Viral Video: ఇంత  కిరాతకం ఏంట్రా: భార్యను..కుక్కలా కట్టేసి..బండితో ఈడ్చుకెళ్లిన భర్త

వాళ్లు భార్యభర్తలు..భర్త తాగుడుకు బానిస అయ్యాడు.. ఇంట్లోనే రోజూ తాగుతున్నాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు..భర్త తాగుడుపై ఆంక్షలు విధిం చింది భార్య.. ఇంట్లో తాగొద్దు అని గట్టిగా చెప్పినందుకు.. ఆ తాగుబోతు భర్త చేసిన కిరాతకం.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.. చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఇంత దారుణమా..మద్యం మత్తు అతన్ని కిరాతకున్ని చేసింది. భార్య కూడా ఓ మనిషే అన్న సంగతి మరిచి.. దారుణంగా హింసించాడు.  గ్రామస్తులంతా సినిమాలా చూశారు.. వీడియోలు తీశారు. కానీ ఒక్కరూ కూడా ఈ దారుణాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు..  తాగుబోతు భర్త .. భార్యను మోటారు బైక్ కు తాళ్లతో కట్టేసి.. రాళ్లు తేలిన రోడ్లపై కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో జరిగింది.  

ఆమె చేసిన తప్పు ఏంటంటే..రోజు తాగుతున్న భర్తను మందలించడమే..సపోర్టు చేసిన అత్తను ఎదిరించడమే..ఫలితంగా భర్త చేతిలో అత్యంత దారుణంగా హింసిం చ బడింది. జూలైలో జరిగిన ఈ సంఘటన వీడియోలో  వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఆమె నొప్పితో అరుస్తున్నా..గ్రామస్థులు మూగ ప్రేక్షకులుగా చూస్తు న్నప్పుడు ఆమెను లాగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. 

అసలేం జరిగిందంటే.. 

రాజస్థాన్ లోని నహర్ సింగ్ పురాకు చెందిన ప్రేమ్ రాం మేఘ్వాల్ కు ఆరు నెలల క్రితం పంజాబ్ కు చెందిన సుమిత్ర తో పెళ్లైంది. అనంతరం ప్రేమ్ రామ్ సుమిత్ర తో కలిసి నహర్ సింగ్ లో నివాసముంటున్నారు.  పెళ్లైన ప్పటి నుంచే ప్రేమ్ రామ్.. సుమిత్రపై శాడిజం చూపించడం మొదలు పెట్టాడు. మహిళతో సహా పక్కవాళ్లతో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. ఒంటరిగా ఉంచేవాడు. రోజూ తాగొస్తూ హింసించేవాడు.. దీంతో సుమిత్ర.. భర్త ప్రేమ్ రామ్ మేఘ్వాల్, అతని తల్లితో వాగ్వాదం జరిగేదని స్థానికులు చెబుతున్నారు.

 దీంతో రెచ్చిపోయిన ప్రేమరామ్ మద్యం మత్తులో భార్యను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమెను తన బైక్ వెనుక కట్టి లాగుతూ కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. గ్రామస్తులు సంఘటనను రికార్డ్ చేసినప్పటికీ జోక్యం చేసుకోలేదు. ఈ వీడియో చివరకు సోషల్ మీడియాలో ద్వార పోలీసుల దృష్టిని రావడంతో చర్యలు చేపట్టారు. 

సోమవారం ఆగస్టు 13, 2024 మధ్యాహ్నం ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో షేర్ చేయబడింది.  భార్యను అత్యంత దారుణంగా వేధించిన నిందితుడు ప్రేమ్ రాం మేఘ్వాల్ (28) ని నహర్ సింగ్ పూరా గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మేఘ్వాల్ పై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సుమిత్రను విచారించి నిందితుడిపై చర్యలు చేపడతామని పోలీసులు చెబుతున్నారు.