
యూఎస్, యూకే వంటి దేశాలు ధనిక దేశాలని, హై టెక్నాలజీతో దూసుకు పోతున్నాయని మనవాళ్లు అనుకుంటారు. ఫారెవర్స్ చాలా ఎడ్యుకేటెడ్ అని నమ్ముతుంటారు. సొంత దేశాన్ని తక్కువగా అంచనా వేస్తుంటారు. అయితే ఈ దేశమంటే.. ఇక్కడున్న కొందరికి చులకనేమో గానీ, విదేశీయులకు మాత్రం ప్రత్యేకమే.
ఇండియా అనగానే మీకు ఏం గుర్తొస్తుందని విదేశీయులను ప్రశ్నించగా వచ్చిన ఆన్సర్స్ ఇవే.. పాపులేషన్, ఫుడ్, కలర్స్, బాలీవుడ్, డ్యాన్స్, క్రికెట్, టెక్నాలజీ, ఐటీ, నమస్తే, డైవర్సిటీ. అమేజింగ్, బ్యూటిఫుల్, కాంట్రాస్ట్, ఇంక్రెడిబుల్, మదర్ ఆఫ్ ఏషియా, తందూరి చికెన్, పనీర్ బటర్ మసాలా, చపాతీ, రుచికరమైన కర్రీలు, గోవా, తాజ్ మహల్, కేరళ, వారణాసి, ముంబై, ఢిల్లీ. హైదరాబాద్.
- ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గలది మన భారతదేశం.
- గత 10,000 సంవత్సరాల చరిత్రలో ఏ దేశంపైనా దాడి చేయని దేశం.. మన మాతృ భూమి.
- భారతదేశం సంఖ్యా వ్యవస్థను కనిపెట్టింది. జీరోను ఆర్యభట్ట కనుగొన్నారు.
- ఆయుర్వేదం అనేది మానవులకు తెలిసిన మొట్టమొదటి వైద్య పాఠశాల. వైద్య పితామహుడు.. మన చరకుడు.
- ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లిష్ స్పీకింగ్ కంట్రీ. అంటే, అమెరికా తరువాత ఎక్కువమంది ఇంగ్లిష్ లో మాట్లాడగలిగేది మనదేశంలోనే.
- ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి.
- ఇండియా లార్జెస్ట్ వెజిటేరియన్ కంట్రీ. దాదాపు 40 శాతం మంది మాంసాహారం ముట్టరు.
- ప్రపంచంలో ఉన్న బంగారంలో 11 శాతం మన దేశంలోని మహిళల దగ్గరే ఉంది.
- 1981లో రాకెట్స్, వాటి పరికరాలు పైకిట్, ఎద్దుల బండి మీద తీసుకెళ్లేవారు.. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న స్పేస్ ఏజెన్సీల్లో ఇస్రో ఒకటి. చంద్రుడి మీదకు, మార్స్ మీదకు కూడా ఉపగ్రహాలు పంపి సక్సెస్ అయ్యింది.. మన దేశ స్పేస్ స్టేషన్.. ఇస్రో(ISRO). చంద్రునిపై నీటి జాడలు కనిపెట్టిన ఘనత కూడా ఇండియాకే దక్కింది.
- అరేంజ్డ్ మ్యారేజెస్ మన సంసృతిలో ఒక భాగం. ఇప్పటి యువత ప్రేమ, దోమ అంటున్నా 65 శాతం భారతీయులుపెద్దలు కుదిర్చిన వివాహాలే చేసుకుంటున్నారు. ఇందులో పదిలో ఒకరు మాత్రమే డైవర్స్ తీసుకుంటున్నారు. ప్రపంచంలో తక్కువ రేట్ ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి.
- యూఎస్, యూకె తర్వాత ఎక్కువగిన్నిస్ రికార్డులు ఉన్న దేశం మనదే. ప్రపంచం మొత్తానికి కేవలం నాలుగు సీజెన్స్ మాత్రమే తెలుసు, స్ప్రింగ్(వసంతం), సమ్మర్( వేసవి), ఆటమ్(శరదృతువు), వింటర్(శీతాకాలం). కానీ ఇండియాలో నాలుగు కాదు ఆరు. మరో రెండు అదనంగా ఉంటాయి. సమ్మర్ మాన్ సూన్, వింటర్ మాన్ సూన్.
- మనదేశంలో వెయ్యికి పైగా భాషలున్నాయి. అన్ని యూరపియన్ భాషలకు మూలమైన సంస్కృతం కూడా ఇండియాలో పుట్టిందే.
- ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మనదేశంలోనే ఉంది. అదే వారణాసి.
- ప్రపంచంలో 70 శాతం సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు మన దగ్గరనుంచి వెళ్తాయి. అందుకే మన దేశానికి ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ అని పేరు. పాలు, అరటి పళ్ళు, అల్లం, నిమ్మ, మామిడి ఉత్పత్తిలోనూ మనదే ఫస్ట్.
- గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెనీగా చెలామణి అయింది. ఒమన్, దుబాయ్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, మారిషన్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి.
- పన్నెండేళ్లకు ఓసారి జరిగే గంగానది కుంభమేళాకు వచ్చే జనాల సంఖ్య అంతరిక్షం నుండి చూసినా కనిపించింత ఎక్కువగా ఉంటుంది.
- అమెరికా, చైనా తర్వాత అత్యంత ఎక్కువ సైనిక శక్తి ఉంది మనకే.
ఇవీ మన అలవాట్లే..
సాసర్‌లో చాయ్
వేడి వేడి చాయ్ లేదా కాఫీని కప్పులో అందిస్తే దాన్ని తాగేందుకు చాలామంది ఆలోచి స్తుంటారు. ఎక్కడ మూతి కాలుతుందో అన్న భయం. అయితే మన ఇండియన్స్ అలా కాదు, వేడిగా ఉన్న ఆ చాయ్‌ని సాసర్లో పోసుకుని చల్లగా చేసుకుని వెంటనే జుర్రుమని తాగేస్తారు. ఇదే అలవాటును కొందరు ఫారినర్స్ కూడా నేర్చుకుని మరీ పాటిస్తున్నారు..
చేత్తో తినడం..
మనదేశంలో తప్ప ఇంకెక్కడా ఎవరూ భోజనాన్ని చేతుల్తో తినరు. చెంచాలు, ఫోర్క్లు, చాప్టిస్టిక్స్ వాడుతారు. అయితే కొందరు విదే శీయులు మాత్రం మన అలవాటు నేర్చుకుని పాటిస్తున్నారు. చెంచా, ఫోర్క్ కు బదులుగా మనం తిన్నట్టు చేతులతోనే తింటున్నారు.
ఇంటి బయటే చెప్పులు
మన దగ్గరైతే ఎవరి ఇంటికైనా వెళ్లే చెప్పులను బయటే వదుల్తాం. కానీ ఫారిన్లో అలా కాదు. ఇంట్లోకి నేరుగా చెప్పులు, షూస్ వేసుకుని వెళ్తారు. అయితే కొందరు విదేశీయులు మన అలవాటును పాటిస్తున్నారు. షూస్, చెప్పులు బయటే వదిలేసి ఇతరుల ఇళ్లలోకి వెళ్తున్నారు. ఇది వాళ్లు మన దగ్గర నేర్చుకు న్నదే!
తల ఊపుతూ సమాధానం
మన దగ్గర్నుంచి విదేశీయులు చేసుకున్న అలవాట్లలో ఇది కూడా ఒకటి. అదేంటంటే.. ఎవరైనా ఏదైనా అడిగితే అందుకు మనం తల అటు, ఇటు ఊపుతూ సమాధానం చెబుతాం కదా. అదే పద్ధతిని కొందరు విదేశీయులు కూడా అలవాటు చేసుకున్నారట. మాట్లాడేటప్పుడు తల ఊపే అలవాటు వాళ్లకు బాగా నచ్చిందట.
రంగు రంగుల బట్టలు
మన దగ్గర పండగైనా, పబ్బమైనా రంగు రంగుల బట్టలు వేసుకుంటాం. కానీ విదేశాల్లో అలా కాదు. వాళ్లు ఏ సందర్భమైనా ప్లెయిన్ రంగు దుస్తులనే ఎక్కువగా వేసుకుంటారు. అయితే కొందరు ఫారినర్స్ ఇండియాకు వచ్చి వెళ్లాక కలర్ ఫుల్ గా రెడీ అవడం నేర్చుకుంటున్నారట. మనలాగే శుభ కార్యాలు ఉన్నప్పుడు అందరూ రంగు రంగుల దుస్తులను వేసుకోవడం, మెహందీ పెట్టుకోవడం అలవాటు చేసుకుని అదే పాటిస్తున్నారు.
ఇండియా అంటే డైవర్సిటీ
ఇండియా అంటే డైవర్సిటీ అని మనందరికీ తెలుసు. కానీ విదేశీయులు మనదేశం వచ్చినప్పుడు ఇక్కడ కనిపించే డిఫరెంట్ కల్చర్స్ వాళ్లని ఆశ్చర్యపరచక మానవు. వేసుకునే డ్రెస్ నుంచి చిన్న చిన్న అలవాట్ల దాకా ఎన్నో విషయాలు వాళ్లకు కొత్తగా అనిపిస్తాయి. ఒక్క సౌత్ ఇండియాలోనే ఐదు రాష్ట్రాలకు వెళ్తే.. ఐదు డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్లినట్టు అనిపిస్తుంది. అంత తేడా కనబడుతుంది. మనదేశంలో వందలకు పైగా భాషలు, పదులకు పైగా మతాలు, రకరకాల డ్రెస్సింగ్ స్టైల్స్.. ఇవన్నీ ఇండియాని ఒక్కముక్కలో అర్థమయ్యేలా చెప్పేస్తాయి.
ఆల్ ఇన్ వన్
ట్రావెలింగ్ కోసం ఇండియా వచ్చేవాళ్లకు అదో మర్చిపోలేని అనుభూతి. చాలా దేశాలు ఏదో ఒక రకమైన డెస్టినేషన్స కి మాత్రమే ఫేమస్. ఉదాహరణకు థాయ్ ల్యాండ్ బీచ్లకు, ఆఫ్రికా ఎడారులకు, స్కాట్ ల్యాండ్ హిల్ స్టేషను.. కానీ, మనదేశంలో ఎలాంటి డెస్టినేషన్ అయినా ఉంటుంది. బీచ్లు, ఐల్యాండ్స్, బ్యాక్ వాటర్స్, మౌంటెయన్స్, హిల్ స్టేషన్స్, డిజర్ట్స్, నేషనల్ పార్క్స్, జంగిల్స్.. ఇలా ఎలాంటి ప్రాంతాలను ఇష్టపడే వాళ్లకైనా... ఇండియా బెస్ట్ ఆప్షన్. మన టూరిజం స్లోగన్ కూడా ఇదే చెప్తుంది. 'ఇంక్రెడిబుల్ ఇండియా' అని. అందుకే విదేశీయులకు ఇండియా ఆల్ ఇన్ వన్ డెస్టినేషన్.
అయ్యో..! అచ్చా..!
నార్త్ ఇండియాలో అయితే అచ్ఛా అనే పదం, సౌత్ ఇండియాలో అయితే అయ్యో అనే పదం మన దగ్గర ఫేమస్. ఈ రెండు పదాలను మనవారు ఎక్కువ సందర్భాల్లో వాడుతుంటారు. అయితే కొంత మంది ఫారినర్లు కూడా ఇవే పదాలను మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. వారు ఈ ఐడియాను మన దగ్గరి నుంచే తీసుకున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రెండు పదాలను వాడడం ఇప్పుడు విదేశాల్లోనూ కామన్ అయిపోయింది.