హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కి మందుబాబు హల్ చల్ .. మేడ్చల్ పరిధిలో జవహర్నగర్ లో ఘటన

హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కి మందుబాబు హల్ చల్ .. మేడ్చల్ పరిధిలో  జవహర్నగర్ లో ఘటన

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు:  హైటెన్షన్  కరెంట్ పోల్ ఎక్కి  మందుబాబు హల్ చల్ చేశాడు. హైదరాబాద్ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధి వికలాంగుల కాలనీలో వెంకటేశ్​  భార్య, ముగ్గురు పిల్లలతో  నివసిస్తున్నాడు. అతడు నిత్యం మద్యం తాగి భార్యను వేధిస్తున్నాడు. శనివారం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో  భార్య లక్ష్మిపై దాడి చేశాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంకటేశ్​ మద్యం మత్తులో కరెంట్ పోల్ ఎక్కి చనిపోతానని బెదిరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.