కుక్కర్ తో కొట్టిన తమ్ముడు.. అన్న మృతి

కుక్కర్ తో కొట్టిన తమ్ముడు.. అన్న మృతి

అన్నదమ్ముల మధ్య చెలరేగిన ఓ వివాదం ఒకరి ప్రాణం తీసింది. మేడ్చల్ గాగిల్లాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసకుంది. గ్రామానికి చెంిన భరత్,సాయితేజ్ అన్నదమ్ములు. తాగిన మత్తులో ఇద్దరు గొడవకు దిగారు.  ఇంట్లో ఉన్న కుక్కర్ తో అన్న భరత్ పై తమ్ముడు సాయితేజ దాడి చేశాడు. దీంతో భరత్ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాడి జరిగిన సమయంలో ఇంట్లోనే తల్లి వరలక్ష్మీ ఉన్నా ఆమె పక్షవాతంతో భాదపడుతు నిస్సహాయ స్ధితిలో పడి ఉంది. స్నేహితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు సాయితేజ కోసం గాలిస్తున్నారు. అయితే ఈనెల 24వ తేదీ అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఇవి కూడా చదవండి:

పెద్దపల్లి జిల్లాలో  రైతు ఆత్మహత్య

ఆ దీక్ష పచ్చి అవకాశవాదం