
పెద్దపల్లి జిల్లా: జులపల్లి మండలం పెద్దపూర్ గ్రామానికి చెందిన పెసరు మొండెయ్య(46) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సంతాన్ రెడ్డి, అశోక్ రెడ్డి,లకు శీను గౌడ్ ద్వారా సన్న వడ్లు అమ్మగా తనకు రావాల్సిన లక్ష రూపాయల డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి నిన్న సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. గుర్తించి వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స ఫలించక కొద్దిసేపటి క్రితం కన్నుమూశాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కరోనా పాజిటివ్
జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు ఆఫర్