మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కరోనా పాజిటివ్

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కరోనా పాజిటివ్

హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా సోకింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల వారం రోజులు రైతుల కోసం డిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. చాపకింద నీరులా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో మంత్రి దయాకర్ రావు అనుమానంతో ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తనతో సన్నిహితంగా తిరిగిన వారు.. కలసిన వారు కరోనా పరీక్షలు చేయించుకుంటే మంచిదని ఎర్రబెల్లి సూచించారు. 

 

ఇవి కూడా చదవండి

జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు ఆఫర్

స్మారక కేంద్రాలు వివిధ సంస్థలకు దత్తత ఇస్తున్నాం

జనవరి 2 వరకు ర్యాలీలు, సభలు బంద్