జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు న్యూ ఇయర్ ఆఫర్

జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు న్యూ ఇయర్ ఆఫర్
  • 29 రోజుల అదనపు వ్యాలిడిటీ
  • జనవరి 2 వరకు అందుబాటులో ఆఫర్

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం స్వాగత దినోత్సవం దగ్గరపడుతున్న వేళ.. రిలయన్స్ జియో తన ప్రిపెయిడ్ కస్టమర్లకు కొత్త ఆఫర్ ప్రకటించింది.  రూ. 2,545 ప్లాన్‌పై 29 రోజుల అదనపు కాలపరిమితిని అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ కాలపరిమితి 336 రోజులు కాగా ఆఫర్‌లో భాగంగా 365 రోజులు పొడిగింపు లభిస్తుంది. జనవరి 2వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని జియో పేర్కొంది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం. ఆ కొత్త సంవత్సర ఆఫర్ కొత్త వినియోగదారులతోపాటు  ప్రస్తుత వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని జియో తెలియజేసింది. ఈ జియో ఆఫర్ పట్ల నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. సామాన్యులకు అందుబాటులోలేని ఆఫర్ ఒక ఆఫరేనా అంటూ నిట్టూరుస్తూ కామెంట్లు చేస్తున్నారు. 

 

ఇవి కూడా చదవండి

స్మారక కేంద్రాలు వివిధ సంస్థలకు దత్తత ఇస్తున్నాం

జనవరి 2 వరకు ర్యాలీలు, సభలు బంద్