హాస్పిటల్ ముందు డ్రింకింగ్.. వద్దన్నందుకు కత్తితో దాడి

హాస్పిటల్ ముందు డ్రింకింగ్.. వద్దన్నందుకు కత్తితో దాడి

ఎల్బీనగర్, వెలుగు: హాస్పిటల్​ ముందు మందు తాగుతున్న యువకులను పక్కకు వెళ్లాలని చెప్పినందుకు సిబ్బందిపై మందుబాబులు కత్తితో దాడి చేశారు. ఇన్​స్పెక్టర్ మహేశ్​గౌడ్ తెలిపిన ప్రకారం.. ఎల్బీనగర్ కు చెందిన ఇరిగి రిశీష్(20), అనగోని మణిశంకర్(20), పల్లె ప్రవీణ్, అభిరామ్  సాగర్ రింగ్ రోడ్డు యశోద నగర్ కాలనీలో జెమ్ కిడ్నీ హాస్పిటల్​ ముందు గురువారం రాత్రి మద్యం సేవిస్తూ గట్టిగా అరుస్తున్నారు. 

హాస్పిటల్​ రిసెప్షనిస్ట్ విద్యాసాగర్ వారి వద్దకు వెళ్లి పేషంట్స్ ఇబ్బంది పడుతున్నారని, పక్కకు వెళ్లాలని కోరాడు. దీంతో విద్యాసాగర్ తో గొడవకు దిగిన ఐదుగురు యువకులు కత్తితో దాడి చేశారు

స్థానికుడు వేణుగోపాల్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతన్ని కూడా చితకబాదారు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రితీశ్, మణిశంకర్ ను రిమాండ్ కు తరలించారు. ప్రవీణ్, అభి,రామ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.