
హైదరాబాద్, వెలుగు: స్నాక్స్, పాలు, డ్రింక్స్వంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్టులు అమ్మే డీఎస్ గ్రూప్ 2024–-25 ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల కోట్ల ఆదాయం సంపాదించింది. ఫలితంగా భారతదేశంలోని టాప్ 15 ఎఫ్ఎంసీజీ కంపెనీల లిస్టులోకి చేరుకున్నామని పేర్కొంది. ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగం నుంచి భారీ రాబడి రావడంతో ఆదాయం పెరిగింది. ఇది కంపెనీ మొత్తం ఆదాయంలో 42శాతం వాటాను అందించింది. ఆర్గానిక్గ్రోత్ ద్వారా డీఎస్గ్రూప్ గత మూడేళ్లలో 16 శాతం సీఏజీఆర్సాధించిందని డీఎస్గ్రూప్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. రాబోయే 4-–5 ఏళ్లలో రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
దాల్మియా భారత్ లాభం రూ.439 కోట్లు
న్యూఢిల్లీ: సిమెంట్ తయారీ సంస్థ దాల్మియా భారత్ లిమిటెడ్‌కు ఈ ఏడాది జనవరి–-మార్చి క్వార్టర్‌లో రూ. 439 కోట్ల నికర లాభం (స్టాండ్ ఎలోన్) వచ్చింది. ఖర్చులు తగ్గించుకోవడంతో లాభం పెరిగిందని కంపెనీ పేర్కొంది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ. 320 కోట్లతో పోలిస్తే తాజాగా వచ్చిన నికర లాభం 37.18 శాతం ఎక్కువ.
కానీ, సేల్స్ పడిపోవడంతో పాటు, సిమెంట్ ధరలు తగ్గడంతో రెవెన్యూ ఏడాది లెక్కన 5 శాతం తగ్గి రూ. 4,307 కోట్ల నుంచి రూ. 4,091 కోట్లకు పడింది. మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను డాల్మియా భారత్‌కు రూ. 699 కోట్ల నికర లాభం, రూ. 14,233 కోట్ల రెవెన్యూ వచ్చింది. రూ. 2 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో షేరుకు రూ. 5 చొప్పున ఫైనల్ డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. దాల్మియా భారత్ షేర్లు బుధవారం 0.47 శాతం తగ్గి రూ. 1,893.50 వద్ద స్థిరపడ్డాయి.