నేటి నుంచి డీఎస్సీ దరఖాస్తులు

నేటి నుంచి డీఎస్సీ దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11,062 టీచర్  పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. వచ్చే నెల 3 వరకూ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజును రూ.వెయ్యిగా నిర్ణయించారు. అయితే, ఫీజు చెల్లింపునకు మాత్రం ఏప్రిల్ 2ను చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం విద్యాశాఖ అధికారులు డిటైల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఇందులో జిల్లాల్లో సబ్జెక్టులు, కమ్యూనిటీల వారీగా ఖాళీల వివరాలను వెల్లడించనున్నారు.