చండూరు (మర్రిగూడ), వెలుగు: గ్రామాల్లో నిర్వహించే సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని దేవరకొండ డీఎస్పీ ఎంవీ శ్రీనివాస్ రావు కోరారు. ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలోని జడ్పీ హెచ్ ఎస్ హై స్కూల్ ఆవరణలో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులతో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఎన్నికల నియమావళి పట్ల అవగాహన కల్పించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. నాంపల్లి సీఐ దూది రాజు, మర్రిగూడ ఎస్సై కృష్ణారెడ్డి, చండూరు మండలం కొండాపురంలో సీఐ ఆదిరెడ్డి, ఎస్సై వెంకన్న పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
