గణేశ్ పండుగలో గొడవలు జరుగొద్దు : ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్

గణేశ్ పండుగలో గొడవలు జరుగొద్దు : ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్

సదాశివనగర్​, వెలుగు: గణేశ్​ పండుగను గొడవలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్​ సూచించారు. శనివారం సదాశివనగర్​ రైతు వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలన్నారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు అనుమతి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సంతోష్​గౌడ్​, ఎస్సై పుష్పరాజ్, వివిధ గ్రామాల గణేశ్​ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. 

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..

తాడ్వాయి: గణేశ్​ ఉత్సవాల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని తాడ్వాయి ఎస్సై మురళి హెచ్చరించారు. శనివారం ఆయన తాడ్వాయిలో యూత్ సభ్యులకు ఉత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిమజ్జనం రోజు ఎవరూ మద్యం సేవించవద్దన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు శివాజీ, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు జక్కుల రాజిరెడ్డి, యువకులు పాల్గొన్నారు.