నర్సంపేట, వెలుగు: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీటీఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. డీటీఎఫ్ ఆధ్వర్యంలో 'ప్రభుత్వ విద్యారంగ భవిష్యత్తు - మన కర్తవ్యం' అనే అంశంపై నర్సంపేట టౌన్‌లోని బాలాజీ మహిళా కాలేజీలో బుధవారం విద్యాసదస్సు జరిగింది. సదస్సుకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన లింగారెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని లాభనష్టాలతో కాకుండా తగినన్ని నిధులు కేటాయించాల్సిన బాధ్యత పాలకులపైనే ఉందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరంగా ఉన్నారని, వారిని చైతన్యపర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఐక్య ఉద్యమాలు చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. డీటీఎఫ్జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కాగిత యాకయ్యను పలువురు అభినంధించారు. కార్యక్రమంలో ఆసంఘం లీడర్లు రఘుశంకర్‌రెడ్డి, ఎస్కే సర్ధార్, డాక్టర్ గంగాధర్, శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, రాంరాజ్, సుదర్శన్, గుంటి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
