స్టూడెంట్స్ కు DTHలో పాఠాలు

స్టూడెంట్స్ కు DTHలో పాఠాలు

స్కూలు పిల్లలకు స్వయం ప్రభ DTH చానెళ్లలో ఈ–క్లాసులు నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది. ఎంపిక చేసిన రాష్ట్రాల్లో  రోజూ నాలుగు గంటల పాటు క్లాసులు నిర్వహించనుంది. ఉత్తరాఖండ్ లో ప్రభుత్వ ఉద్యోగులకూ వర్క్​ ఫ్రం హోమ్​ ఆఫరిచ్చింది అక్కడి సర్కార్​. కరోనాపై పోరాటానికి రూ.200 కోట్లు విడుదల చేస్తున్నట్టు కర్నాటక సర్కా రు ప్రకటించింది. అవసరమైతే తప్ప వేరే రాష్ట్రాలకు వెళ్లొద్దని తమిళనాడు సర్కారు ప్రజలకు సూచించింది. మహారాష్ట్రలో రెస్టారెంట్లతో పాటు బార్లు , వైన్​షా పులనూ మూసేస్తూ తాజాగా ఉత్తర్వు లొచ్చాయి. జమ్మూకాశ్మీర్​లో ట్రాన్స్​పోర్ట్​ను బంద్ పెట్టారు. వైష్ణోదేవి యాత్రను రద్దు చేశారు. రాజస్థాన్​లో ని జోధ్ పూర్​ మెహ్రాన్​గఢ్ కోట, ఉమైద్ భవన్​ ప్యాలేస్ మ్యూ జియం, రావ్ జోధా డిజర్ట్​ రాక్​ పార్క్​, జస్వంత్​ ఠాడా, అచ్చిఛత్రగఢ్ ఫోర్ట్​లు మూసేశారు.