
దుబ్బాకలో ఉపఎన్నిక మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్…. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత.. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. తన స్వగ్రామమైన బొప్పాపూర్‌లో ఓటు వేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. తోగుట మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేతలు సూచించారు.
నియోజకవర్గంలోని మొత్తం 7 మండలాల్లోని 148 గ్రామాల్లో 315 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఎలక్షన్ అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. కరోనా లక్షణాలున్న వారికి మాత్రం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
For More News..