దుబ్బాక ఐవోసీకి మరో రూ.6 కోట్లు ఇవ్వాలి: రఘునందన్ ​రావు

దుబ్బాక ఐవోసీకి మరో రూ.6 కోట్లు ఇవ్వాలి: రఘునందన్ ​రావు

దుబ్బాక, వెలుగు : దుబ్బాక ఐవోసీకి ప్రభుత్వం మరో రూ. 6 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు కోరారు. బిల్డింగ్​ నిర్మాణ పనులు పూర్తి చేసి ఈ నెల 11న మంత్రి హారీశ్​రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు ఆదేశించారు. సమీకృత భవనాన్ని గురువారం అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవనంలో కొలువు దీరే శాఖల అధికారులు కలెక్టర్​ సూచనల మేరకు షిప్ట్​ చేసుకోవాలని సూచించారు. భవనానికి ప్రభుత్వం రూ. 17 కోట్లను మంజూరు చేసిందని, నిర్మాణానికి కాంట్రాక్టర్లు రూ. 14 కోట్లను ఖర్చు చేశారని తెలిపారు.

 మిగతా  రూ. 3 కోట్లతోపాటు అదనంగా మరో రూ. 6 కోట్ల నిధులను మంజూరు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ప్రధాన రోడ్డు నుంచి ఐవోసీ బిల్డింగ్​ వరకు సీసీ రోడ్డును మంజూరు చేయాలని కోరారు. తాను గెలిచిన తర్వాతనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పెండింగ్​లో ఉన్న బస్టాండ్​, వంద పడకల ఆసుపత్రి, డబుల్​ బెడ్ ​రూమ్​ ఇండ్లను పూర్తి చేసి ప్రారంభించుకున్నామని తెలిపారు.  నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ భవనాన్ని పూర్తి చేసి ఇదే నెలలో విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్​రెడ్డి, మట్ట మల్లారెడ్డి, దూలం వెంకట్ గౌడ్, సుంకు ప్రవీణ్, పగడాల నరేందర్, రమేశ్​రెడ్డి, తొగుట రవి 
పాల్గొన్నారు.