రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోంది

రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోంది

రాష్ట్రంలో కుటుంబ పాలన కోనాసాగుతోందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. బాన్సువాడ నియోజకవర్గంలో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో  డబల్ బెడ్రూమ్ ఇండ్లు లేవన్నారు. కేంద్రం సమన్వయ పాలన చేయాలంటున్న కెటిఆర్, జిల్లాలోనే సమన్వయ పాలన లేదన్నారు. నరేంద్రమోడీని  ప్రశ్నించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. కుటుంబ పాలన లేని పార్టీ బిజెపి పార్టీ అన్నారు రఘునందన్ రావు. బలమైన రాష్ట్రం ఉండాలన్నదే బిజెపి నినాదం అన్నారు. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే,బిజెపి పార్టీ మద్దతు ఇస్తే...తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. బిల్లు  ప్రవేశపెట్టిన సమయంలో పార్లమెంట్ లో  ఎంపీ గా ఉండి కేసీఆర్ ఓటేయలేదన్నారు. బిజెపి కార్యకర్తలు బాన్సువాడను జిల్లా  చేయాలని అడిగిోతూ దాడులు చెస్తారా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర యువరాజ్  కేటిఆర్ వస్తే ప్రజాస్వామ్య పద్దతిలో కలుద్దాం అని వెళ్తే...  కొడ్తరా? అంటూ రఘునందన్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం లో నిరసనలను గౌరవించాలన్నారు. ఆ సమస్యలను పరిష్కారించాలి.. కాని భౌతిక దాడులు మంచి పద్దతి కాదదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే. 

ఇవి కూడా చదవండి:

పంజాబ్ మాజీ సీఎంపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

మర్రి చెట్టుకు కేసీఆర్‌ పేరు