పంజాబ్ మాజీ సీఎంపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

పంజాబ్ మాజీ సీఎంపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఫతేఘర్ సాహిబ్‌లో రాహుల్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పంజాబ్ మాజీ సీఎం కెఫ్టెన్ అమరీందర్ సింగ్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఎందుకు తొలగించారో తాను చెబుతానన్నారు. పేద ప్రజలకు ఉచిత కరెంటు ఇచ్చేందుకు ఆయన అంగీకరించకపోవడం వల్లనే సీఎంగా అమరీందర్‌ను తొలగించడానికి కారణం అన్నారు. తనకు నాకు విద్యుత్ సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం ఉందని కెఫ్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారన్నారు.

ఇక పంజాబ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై కూడా రాహుల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ దేశానికి ముప్పు అని తాను చెబుతూనే ఉన్నానన్నారు. పంజాబ్ ప్రయోగాలు చేయవలసిన రాష్ట్రం కాదని ఇప్పుడు మళ్లీ చెబుతున్నాని అన్నారు. పంజాబ్‌లోని యువత జీవితాలను డ్రగ్స్ నాశనం చేయడం కొనసాగితే పంజాబ్‌లో అభివృద్ధి అర్థరహితమన్నారు రాహుల్ గాంధీ.  అంతకుముందు ప్రధాని మోడీ పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో రిమోట్ కంట్రోల్ సీఎంగా పనిచేయలేదనే.. కెఫ్టెన్ అమరీందర్ సింగ్‌ను సీఎం పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతల రిమోట్ ఢిల్లీలో ఉంటుందని మోడీ ఎద్దేవా కూడా చేశారు. 

ఇవి కూడా చదవండి: 

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం

కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదు