
‘ది లయన్ కింగ్’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ వస్తోంది. డిసెంబర్ 20న ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఇందులోని లీడ్ రోల్ అయిన ముఫాసా పాత్రకు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. అలాగే ముఫాసా కొడుకు సింబా పాత్రకు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పగా, చిన్న కొడుకు అబ్రమ్ ఖాన్ ముఫాసా చిన్నప్పటి పాత్రకు డబ్బింగ్ చెప్పాడు.
షారుఖ్, అతని కొడుకులు డబ్బింగ్ చెబుతుండడంతో హిందీ వెర్షన్‌పై ఆసక్తి నెలకొంది. అలాగే పుంబా పాత్రకు సంజయ్ మిశ్రా, టిమోన్‌కు శ్రేయాస్ తల్పాడే వాయిస్ చెప్పారు. గతంలో ‘ది లయన్ కింగ్’కు తెలుగులో నాని డబ్బింగ్ చెప్పాడు. మరి ఈసారి తెలుగులో ఎవరి వాయిస్ వినిపించనుందో చూడాలి!