వరుసగా 4 రోజులు సెలవులు.. ఊర్లకు పయనమైన నగరవాసులు

వరుసగా 4 రోజులు సెలవులు.. ఊర్లకు పయనమైన నగరవాసులు

వరుసగా నాలుగు రోజులు సెలవులు కలిసిరావడంతో హైదరాబాద్ ప్రజానీకం ఊర్లకు పయనమయ్యారు. ఆగస్ట్ 12వ తేదీ రెండో శనివారం కాగా.. ఆగస్ట్ 13వ తేదీ ఆదివారం.. ఆగస్ట్ 15న ఎలాగూ ఇండిపెండెన్స్ డే హాలిడే ఉంది. దీంతో ఆగస్ట్ 14వ తేదీ(సోమవారం) ఒక్క రోజు సెలవు పెట్టుకొని ఊర్లకు పరుగులు తీస్తున్నారు. 

గత రెండు నెలలుగా సిటీ జనానికి ఈ విధంగా వరుసగా సెలవులు కలిసి రాలేదు. దీనికి తోడు రెండు వారాలు వర్షాల పడడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే వరస సెలవులు రావడంతో రిలాక్స్ బాట పట్టడానికి సిటీ వదిలి సొంతూర్లకు వెళ్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఐటీ ఉద్యోగులు పూర్తి హాలిడే మూడ్ లోకి వెళ్లిపోయారు. ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.

అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ట్రావెల్స్‌లలో టికెట్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయట. నాలుగు రోజులు నగరానికి దూరమంటూ ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మళ్లీ సిటీలో రెగ్యులర్ హడావిడి అంటే వచ్చే బుధవారమే అంటున్నారు.