చెన్నైలో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్

చెన్నైలో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్

చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెన్నైలోని ప్రధాన నగరాల్లోని రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. దీంతో వాహనదారుల ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు.

శుక్రవారం (నవంబర్ 3న) నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందుగానే వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. చెన్నైలో చాలా చోట్ల భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వచ్చే ఏడు రోజుల్లోనూ చెన్నైలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌లోని 15 జోన్లతో పాటు ఇతర జిల్లాల్లో పరిస్థితిని పర్యవేక్షించడానికి స్టాలిన్ ప్రభుత్వం మానిటరింగ్ అధికారులను నియమించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్​ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.