
బెంగళూరు: నార్త్ జోన్ బ్యాటర్ ఆయుష్ బదోనీ (204 నాటౌట్) డబుల్ సెంచరీతో చెలరేగడంతో.. ఈస్ట్ జోన్‌తో ఆదివారం ముగిసిన దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయ్యింది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో నార్త్ జోన్ సెమీస్‌లోకి ప్రవేశించింది. 388/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్‌ను 146.2 ఓవర్లలో 658/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్ అనికేత్ కుమార్ (198) డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా, ఆయుష్ బదోనీ మాత్రం ఈ ఫీట్‌ను అందుకున్నాడు. డే మొత్తం అద్భుతంగా ఆడిన బదోనీ.. అనికేత్‌తో మూడో వికెట్‌కు 150, నిశాంత్ సంధు (68)తో నాలుగో వికెట్‌కు 157 రన్స్ జత చేశాడు. ముక్తార్, సూరజ్, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్ తలా ఓ వికెట్ తీశారు. నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 405 రన్స్ చేయగా, ఈస్ట్ జోన్ 230 రన్స్‌కే పరిమితమైంది. గురువారం నుంచి జరిగే సెమీస్‌లో నార్త్ జోన్.. సౌత్ జోన్‌తో తలపడుతుంది.
కెప్టెన్‌గా అజారుద్దీన్..
దులీప్ ట్రోఫీ సెమీస్‌లో సౌత్ జోన్‌కు... కేరళ బ్యాటర్ మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కెప్టెన్‌గా ఎంపికైన తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ ఆసియా కప్‌కు వెళ్లనుండటంతో అతని ప్లేస్‌లో అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. తమిళనాడు ప్లేయర్ ఎన్. జగదీశన్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. చేతి గాయం నుంచి కోలుకుంటున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆర్. సాయి కిశోర్ సెమీస్ మ్యాచ్‌లో ఆడటం లేదు. అనికేత్ శర్మ, షేక్ రషీద్ (ఆంధ్ర)ను కొత్తగా జట్టులోకి తీసుకున్నారు.